నట్టేట ముంచుతున్నారు

ABN , First Publish Date - 2020-09-21T07:56:58+05:30 IST

నాడు ఎన్నికల సమయంలో నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచుతున్నారంటూ వైసీపీ నేతలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ

నట్టేట ముంచుతున్నారు

కృష్ణా నదిలో నిలబడి రైతుల వినూత్న నిరసన

ఢిల్లీకి మహిళా జేఏసీ

 278వ రోజు కొనసాగిన అమరావతి ఆందోళనలు

 

గుంటూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నాడు ఎన్నికల సమయంలో నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచుతున్నారంటూ వైసీపీ నేతలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 278వ రోజుకు చేరాయి. రైతులతో సమాన ప్యాకేజీ ఇస్తామంటూ చెప్పిన సీఎం జగన్‌ నేడు ఏకంగా అమరావతినే తరలిస్తున్నారంటూ రాయపూడికి చెందిన అసైన్డ్‌, దళిత రైతులు కృష్ణానదిలో నిలబడి నిరసనలు తెలిపారు.


 అమరావతి రైతుల గుండెచప్పుడు ఢిల్లీలో వినిపించే లక్ష్యంగా మహిళా జేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం హస్తినకు బయలుదేరి వెళ్లారు. 


Updated Date - 2020-09-21T07:56:58+05:30 IST