స్టైరిన్ ప్రభావిత గ్రామాల్లో నీరి బృందం పర్యటన

ABN , First Publish Date - 2020-05-10T20:58:31+05:30 IST

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో స్టైరిన్ కెమికల్ ప్రభావిత గ్రామాల్లో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) బృందం పర్యటిస్తోంది. ఆయా గ్రామాల్లో కెమికల్ ప్రభావంపై అధ్యయనం చేస్తోంది.

స్టైరిన్ ప్రభావిత గ్రామాల్లో నీరి బృందం పర్యటన

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటనలో స్టైరిన్ కెమికల్ ప్రభావిత గ్రామాల్లో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) బృందం పర్యటిస్తోంది. ఆయా గ్రామాల్లో కెమికల్ ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. స్టైరిన్ ప్రభావం నీరు, గాలి, భూమి, మొక్కల్లో ఎంత మేర ఉందనే దానిపై పరిశీలిస్తోంది. అదేవిధంగా స్టైరిన్ కెమికల్ ప్రభావిత గ్రామాల్లోకి ప్రజలు వస్తే నివాసయోగ్యంగా ఉంటుందా? లేదా అనే విషయంపైనా విశ్లేషణ చేస్తున్నారు. ఇందుకోసం శాంపిల్స్‌నే సేకరించారు. ఈ శాంపిల్స్‌ను పూణెకు పంపించనున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాతే ప్రజల్ని గ్రామాల్లోకి నివసించేందుకు అనుమతించనున్నారు. కాగా, రిపోర్ట్ వచ్చేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-10T20:58:31+05:30 IST