సీఎం గారూ.. మీ చుట్టూ చాలామంది కట్టప్పలు: ఎంపీ రఘురామ రాజు

ABN , First Publish Date - 2020-08-18T21:37:50+05:30 IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన చుట్టూ ఉండే కట్టప్పలను గుర్తించాలని సూచించారు.

సీఎం గారూ.. మీ చుట్టూ చాలామంది కట్టప్పలు: ఎంపీ రఘురామ రాజు

ఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన చుట్టూ ఉండే కట్టప్పలను గుర్తించాలని సూచించారు. లేదంటే ప్రమాదమని హెచ్చరించారు. ‘‘అవినీతిని ఏమాత్రం ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీకు పేరుంది, కానీ మీ పక్కనే ఉంటూ.. అవినీతికి పాల్పడుతున్న కట్టప్పను మీరు పట్టుకుని తీరాలి. సినిమా కాబట్టి బాహుబలిని కట్టప్ప పొడిచేశాడు. ఈ కట్టప్పను మీరు కనిపెట్టాలి. మీపైనే రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మీపై ఉన్న విశ్వసనీయతను కాపాడుకోవాలి అంటే.. అతి త్వరలో ఆ కట్టప్పను పట్టుకుని శిక్షించాలి. అలాంటి కట్టప్పలు చాలా మందే ఉన్నారు. మీ పక్కన ఉంటూ పనికిరాని మాటలు చెబుతూ, వారిపై వీరిపై చాడీలు చెబుతూ.. ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్న వారిని మీరు కనిపెట్టి శిక్షించాలి’’ అని రఘురామ రాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-18T21:37:50+05:30 IST