‘కరోనా విషయంలో జగన్‌ చెప్పినట్లే...’

ABN , First Publish Date - 2020-05-30T22:43:32+05:30 IST

జగన్‌ని జైల్లో పెట్టించిన సోనియా, చంద్రబాబు రాజకీయ భవిష్యత్‌ ఏవిధంగా మారిందో చూస్తున్నామని మంత్రి నారాయణస్వామి అన్నారు.

‘కరోనా విషయంలో జగన్‌ చెప్పినట్లే...’

చిత్తూరు: జగన్‌ని జైల్లో పెట్టించిన సోనియా, చంద్రబాబు రాజకీయ భవిష్యత్‌ ఏవిధంగా మారిందో చూస్తున్నామని మంత్రి నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు ఎస్సీలను విడదీసి పాలించే చర్యలు చేపట్టారన్నారు. మాల, మాదిగలకు సీఎం జగన్‌ దగ్గరయ్యారని చెప్పారు. కరోనా విషయంలో జగన్‌ చెప్పినట్లే ప్రపంచమంతా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మామ ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించారని వ్యాఖ్యానించారు. 

 

Updated Date - 2020-05-30T22:43:32+05:30 IST