పోలవరం నిధుల కోసం ఐక్య పోరు: నారాయణ
ABN , First Publish Date - 2020-10-27T09:34:50+05:30 IST
Narayana..

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రప్పించేలా ఐక్య పోరాటాలు సాగించాలని సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.