నరసరావుపేటలో దౌర్జన్యకాండ

ABN , First Publish Date - 2020-03-12T10:32:25+05:30 IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ శ్రేణులు

నరసరావుపేటలో దౌర్జన్యకాండ

నరసరావుపేట, మార్చి 11: గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ శ్రేణులు దౌర్జన్యకాండకు పాల్పడ్డాయి. ఆర్డీవో కార్యాలయంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు చేశాయి. నామినేషన్ల పత్రాలు లాక్కొని చింపివేశారు. టీడీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చదలవాడ అరవిందబాబుతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ వర్గాలు దాడి చేశాయి. ఈ ప్రాంతంలో ఐదు ఎంపీటీసీలకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. పమిడిపాడుకు చెందిన జనసేన అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వస్తుండగా కోర్టు సమీపంలో వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు.

Updated Date - 2020-03-12T10:32:25+05:30 IST