ముసుగులో దోపీడీ అంటూ జగన్‌కు లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2020-06-25T16:40:03+05:30 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

ముసుగులో దోపీడీ అంటూ జగన్‌కు లోకేష్ లేఖ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేఖలో లోకేష్ కోరారు. అలాగే సంక్షేమ మండలి బోర్డు, గతంలో మాదిరి కార్మిక సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరారు.


రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుండి భవన నిర్మాణ కార్మికులకు వెతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో పేట్రేగిపోతోందో తాజాగా ఓ మంత్రికి ఇసుకకు బదులు మట్టి పంపించిన ఘటనే నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. ఇదంతా స్టాక్ యార్డు ముసుగులో జరుగుతున్న దోపిడీ అని అధికారులు, వైసీపీ నేతలే ఇందులో సూత్రధారులన్నది సుస్పష్టమని విమర్శించారు. 



Updated Date - 2020-06-25T16:40:03+05:30 IST