షిప్ యార్డు ప్రమాద ఘటనపై నారా లోకేష్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-08-01T19:46:10+05:30 IST

విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది చనిపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

షిప్ యార్డు ప్రమాద ఘటనపై నారా లోకేష్ దిగ్భ్రాంతి

అమరావతి: విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది చనిపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క‌ చ‌ర్య‌లు చేప‌ట్టి క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. అలాగే మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-01T19:46:10+05:30 IST