ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు: లోకేశ్

ABN , First Publish Date - 2020-05-09T18:23:49+05:30 IST

వైజాగ్ గ్యాస్ లీకేజ్‌ ఘటనలో స్థానికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ అన్నారు.

ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు: లోకేశ్

అమరావతి: వైజాగ్ గ్యాస్ లీకేజ్‌ ఘటనలో స్థానికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ అన్నారు. మెడికల్‌ క్యాంపులు, షెల్టర్లు లేవని, అంతా కలుషితమైందని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటాయంటూ ఆర్ ఆర్ వెంకటాపురంలో యువత ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. తమ సమస్యలను చెప్పుకుంటూ యువత ఆందోళనకు దిగితే.. వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ పది కోట్లు, 30 కోట్లు ఇస్తామంటూ డబ్బుతో చూస్తున్నారని మండిపడ్డారు. Updated Date - 2020-05-09T18:23:49+05:30 IST