రాష్ట్రాన్ని దోచుకున్న జగన్కు బేడీలు తప్పవు: లోకేష్
ABN , First Publish Date - 2020-10-28T23:55:20+05:30 IST
రాష్ట్రాన్ని దోచుకున్న జగన్కు బేడీలు తప్పవు: లోకేష్

అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం రైతులు భూములిచ్చారని టీడీపీ నేత, మజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతిని జగన్ సమర్థించారని గుర్తుచేశారు. రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి ఆనాడు రైతులు భూములిస్తే...ఇప్పుడు అదే రైతులకు బేడీలు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఏం తప్పు చేశారని రైతుల చేతులకు బేడీలు వేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్కు బేడీలు తప్పవన్నారు.