ఓటేసిన నేరానికి ఆత్మహత్య గిఫ్టా?: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-12-19T07:17:56+05:30 IST

జగన్‌రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదని, అన్నీ రివర్సేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

ఓటేసిన నేరానికి ఆత్మహత్య గిఫ్టా?: లోకేశ్‌

అమరావతి/విశాఖ/విజయవాడ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదని, అన్నీ రివర్సేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైసీపీకి ఓటేసిన నేరానికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అనపర్తి ఎమ్మెల్యే.. వేధింపులతో అరుణకుమారి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైసీపీకి ఓటేసినందుకు ఆమెకు లభించిన గిఫ్ట్‌! వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజలను మింగేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Read more