-
-
Home » Andhra Pradesh » Nara Lokesh Sensational Tweet
-
జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైంది: లోకేష్
ABN , First Publish Date - 2020-12-28T16:37:52+05:30 IST
జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

విజయవాడ: జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాయచోటిలో వైసీపీ నాయకుల ఒత్తిడి.. కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్య దోరణి కారణంగా గిరిజన పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడని లోకేష్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గిరిజన యువతి ప్రియాంక ప్రేమపేరుతో మోసపోయింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రియాంక తండ్రికి అవమానం ఎదురవ్వడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ప్రియాంకకు ఈ పరిస్థితి వచ్చిందని లోకేష్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.