రైతు కుటుంబాల కష్టాలు చూసి చలించిపోయిన నారా లోకేష్..
ABN , First Publish Date - 2020-12-28T19:43:45+05:30 IST
హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చలించిపోయారు.
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చింతలమడ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు సాంబశివరావుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు ఎకరాల్లో కౌలు చేశారని.. తుఫాను కారణంగా పంట మొత్తం దెబ్బతిన్నదని.. అప్పుల బాధతో ఆత్మహత్యకి పాల్పడ్డారని సాంబశివరావు కుటుంబ సభ్యులు లోకేష్‌కి తెలిపారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి సహాయం అందించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి నారా లోకేష్ చలించిపోయారు. అవనిగడ్డలో ఆత్మహత్యలు చేసుకున్న సాంబశివరావు, కృష్ణంరాజు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు సహాయం చెయ్యాలని ఈ సందర్భంగా లోకేష్ నిర్ణయించారు. త్వరలో పార్టీ తరుఫున లోకేష్ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయిలు ఆర్థిక సహాయం అందించనున్నారు.