మరో గిరిజన యువతి బలైపోయింది: లోకేశ్

ABN , First Publish Date - 2020-12-28T04:02:35+05:30 IST

మరో గిరిజన యువతి బలైపోయింది: లోకేశ్

మరో గిరిజన యువతి బలైపోయింది: లోకేశ్

అమరావతి: జగన్ రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాయచోటిలో వైసీపీ నేతల ఒత్తిడి, కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యంతో పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకని మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడన్నారు. ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన ప్రియాంక తండ్రికి అవమానం ఎదురైందని తెలిపారు. బాధ్యులైన వైసీపీ నేతలు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-28T04:02:35+05:30 IST