-
-
Home » Andhra Pradesh » Nara Lokesh effect
-
లోకేష్ పర్యటన ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-28T15:59:27+05:30 IST
విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన విషయం తెలియగానే అధికారులు హడావుడిగా రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ చేశారు.

విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన విషయం తెలియగానే అధికారులు హడావుడిగా రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ చేశారు. చాలా కాలంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయాల్సి ఉండగా.. అధికారులు తాత్సారం చేస్తూ వస్తున్నారు. నిన్నటి వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అధికారులు పట్టించుకోలేదు. లోకేష్ వస్తున్నారని తెలియగానే ఆగమేఘాలపై చెక్కుల పంపిణీ చేశారు. రాత్రికి రాత్రే వచ్చి చెక్కులు పంపిణీ చేసి వెళ్లారని రైతు కుటుంబాలు తెలిపాయి.