ఎవరిది శవ రాజకీయం?: నారా లోకేష్

ABN , First Publish Date - 2020-12-31T02:13:05+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబ సభ్యులను

ఎవరిది శవ రాజకీయం?: నారా లోకేష్

కడప: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించి అనంతరం మృతదేహం వద్ద  బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై నారా లోకేష్ మండిపడ్డారు. ‘ఎవరిది శవ రాజకీయం? తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన జగన్ రెడ్డిదా? బాబాయ్ శవాన్ని ఎన్నికల ఎజెండాగా వాడుకున్న జగన్ రెడ్డిదా? హత్యలు చేయిస్తూ ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్న జగన్ రెడ్డిదా? హత్యకు గురైన సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన చంద్రబాబు గారిదా?’ అని నారా లోకేష్ నిలదీశారు.

Updated Date - 2020-12-31T02:13:05+05:30 IST