‘వైఎస్ఆర్ చేయూత కాదు.. జగన్ రెడ్డి చేతి వాటం’

ABN , First Publish Date - 2020-08-12T22:36:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అది వైఎస్ఆర్ చేయూత కాదని, జగన్ రెడ్డి చేతి వాటం

‘వైఎస్ఆర్ చేయూత కాదు.. జగన్ రెడ్డి చేతి వాటం’

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అది వైఎస్ఆర్ చేయూత కాదని, జగన్ రెడ్డి చేతి వాటం అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు పెడుతున్న కుచ్చు టోపీని ఆయన స్పష్టంగా వివరిస్తూ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తే ఏడాదికి రూ.36,000 ఇవ్వాల్సి వస్తుందని, ఐదేళ్లలో రూ.1.80 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కారణంగానే జగన్ రివర్స్ టెండరింగ్ పెట్టారని లోకేష్ విమర్శించారు. ఐదేళ్ల పానలో ఒక్కో బిసి, ఎస్సీ, ఎస్టీ మహిళకు కేవలం రూ. 75,000 ఇస్తామని చెప్పి, ఒక లక్షా ఐదు వేలు నష్టం చేశారని దుయ్యబట్టారు.


ప్రతి ఏటా రూ.17,250 , 4 ఏళ్ళలో రూ.69,000 ప్రజలకు నష్టం చేకూరుతుందన్నారు. మొదటి ఏడాది రూ.36వేలు ఎగనామం పెట్టారని విమర్శించారు. మొత్తంగా ఒక్కో మహిళకు జగన్ రెడ్డి చేతివాటం లక్షా ఐదువేల రూపాయలు అని లోకేష్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో కోటి మందికి పసుపు కుంకుమ పథకాన్ని అమలు చేశామని లోకేష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వమేమో లబ్దిదారులను 23 లక్షలకు తగ్గించి ప్రజల్లో విభేధాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. మిగిలిన వారు పేదలు కాదా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. చాలా మంది పేద మహిళలకు ఆధార్‌లో వయస్సు తప్పుగా నమోదు అయ్యిందన్నారు. వారు నిరక్షరాస్యులు అని, వారికి వయస్సు మార్చుకునే అవకాశం ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-12T22:36:50+05:30 IST