ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నారు: లోకేష్‌

ABN , First Publish Date - 2020-12-30T14:36:46+05:30 IST

అమరావతి: ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నారు: లోకేష్‌

అమరావతి: ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చేనేత‌ వ‌ర్గం నాయ‌కుడిని కిరాతకంగా హత్య చేశారన్నారు. నందం సుబ్బయ్యను ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని నారా లోకేష్ ఆరోపించారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అణిచివేస్తారన్నారు. అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, అయన బావమరిది బంగారురెడ్డిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ప‌రిహారంతో అనాథ‌లైన పిల్లల‌కు తండ్రిని తేగ‌ల‌రా? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

Updated Date - 2020-12-30T14:36:46+05:30 IST