రైతు దినోత్సవం పేరుతో ప్రజాధనం వృథా చెయ్యడం దారుణం: లోకేష్
ABN , First Publish Date - 2020-07-08T19:11:59+05:30 IST
హైదరాబాద్: విత్తనాలివ్వలేని కొడుకు.. 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం..

అమరావతి: విత్తనాలివ్వలేని కొడుకు.. 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి అంటూ సీఎం జగన్, వైఎస్సార్‌ని ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రైతు దినోత్సవం పేరుతో ప్రకటనలిచ్చి ప్రజాధనం వృథా చెయ్యడం దారుణమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ రోజు జగన్ రెడ్డి ‘రైతు దగా దినోత్సవం’ అని పేర్కొన్నారు.
విత్తనాలు ఇవ్వలేని కొడుకు, 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని తండ్రి చిన్నాభిన్నం చేశారు. జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృథా చెయ్యడం దారుణమన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోత, భరోసాలో కోత, గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదు, ఏడాదికి లచ్చ రూపాయిల లబ్ది రత్నం గల్లంతు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు, ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్పు. రైతన్నకు ఒరిగింది ఏంటి?’’ అని లోకేష్ ప్రశ్నించారు.