కాంట్రాక్టర్లపైనే జగన్‌కు ప్రేమ: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-04-05T09:03:17+05:30 IST

‘‘మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు? మా ఇంటికొస్తూ ఏం తెస్తారు? అనే రకం సీఎం జగన్మోహన్‌రెడ్డి. ఆయనకు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ... ప్రజలు, రైతులు, వైద్యులు, ఉద్యోగులపై లేకపోవడం బాధాకరం’’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి

కాంట్రాక్టర్లపైనే జగన్‌కు ప్రేమ: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు? మా ఇంటికొస్తూ ఏం తెస్తారు? అనే రకం సీఎం జగన్మోహన్‌రెడ్డి. ఆయనకు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ... ప్రజలు, రైతులు, వైద్యులు, ఉద్యోగులపై లేకపోవడం బాధాకరం’’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది కంటే రూ.30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా అన్నింటిలోనూ కోతలు పెడుతున్నారని విమర్శించారు. మరి కాంట్రాక్టర్లపై కురిపించిన రూ.6,400 కోట్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? అని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సాయం తాను చేస్తున్నట్లు బిల్డప్‌ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమీలేదని విమర్శించారు.

Updated Date - 2020-04-05T09:03:17+05:30 IST