3 రోజుల వ్యవధిలో ముగ్గురు రైతుల ఆత్మహత్య: లోకేష్

ABN , First Publish Date - 2020-12-15T20:18:31+05:30 IST

జగన్ ప్రభుత్వంపై లోకేష్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

3 రోజుల వ్యవధిలో ముగ్గురు రైతుల ఆత్మహత్య: లోకేష్

అమరావతి: జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకి పాల్పడుతున్నా..దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడంలేదని విమర్శించారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వారికి భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ..బాధ్యతారాహిత్యంగా మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో ఫిడేలు వాయించుకుంటున్న.. జగన్‌రెడ్డి బయటకొచ్చి రైతుల్ని ఆదుకోవాలని లోకేష్‌ కోరారు.

Updated Date - 2020-12-15T20:18:31+05:30 IST