ప్రజా రాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దు: నారా లోకేష్

ABN , First Publish Date - 2020-11-27T18:00:32+05:30 IST

అమరావతి: రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు.

ప్రజా రాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దు: నారా లోకేష్

అమరావతి: రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం సీఎం జ‌గ‌న్‌ శాడిజానికి ప‌రాకాష్ట అని పేర్కొన్నారు. ‘‘రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. రాజధాని మార్చే కుట్రల్ని నిరసిస్తూ రైతులు ఉద్యమిస్తున్నారు. రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దు. కృష్ణాయ‌పాలెం రైతులపై అట్రాసిటీ కేసు పెట్టారు. ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం జ‌గ‌న్‌ శాడిజానికి ప‌రాకాష్ట’’ అని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Read more