-
-
Home » Andhra Pradesh » nara lokesh ap cm kiran
-
పులివెందుల పిల్లి... జగన్‌పై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-11-25T19:07:28+05:30 IST
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. పులివెందుల పిల్లి అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలను చూసి పులివెందుల పిల్లి

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. పులివెందుల పిల్లి అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలను చూసి పులివెందుల పిల్లి భయపడుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటని, గోడ గ్రాండ్ ఓపెనింగ్‌ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో తమ కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అరెస్టు చెయ్యడం అక్రమం అన్నారు. ఇది ప్రభుత్వ పిరికితనాన్ని బయటపెట్టిందని తెలిపారు. మణిరత్నం పెట్టిన పోస్టులో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదని, ప్రతిగా కష్టాలు కొనితెచ్చుకోవడం తప్ప అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.