-
-
Home » Andhra Pradesh » nara lokesh
-
రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం: లోకేష్
ABN , First Publish Date - 2020-12-11T00:32:16+05:30 IST
లుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు.

అమరావతి: తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టిసారించినట్లు తెలిపారు. పనిచేసే వారికే పదవులు, అలంకారంగా భావిస్తే..మూడు నెలల్లో మార్పు తప్పదని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని చెప్పారు. టీడీపీ, ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే.. రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తుపాన్లతో రైతులు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను ఎండగడుతామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.