దొంగ పత్రిక కోసం ప్రజల సొమ్మా?: లోకేశ్
ABN , First Publish Date - 2020-10-19T09:18:35+05:30 IST
వార్డు సచివాలయాలకు జగన్ పత్రిక’ కథనంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘వార్డు సచివాలయాలకు జగన్ పత్రిక’ కథనంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘‘దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మిగడం ఏంటి జగన్? ఒకపక్క ప్రకటన ల పేరుతో వందల కోట్ల దోపిడి. ఇప్పుడు ఏకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు. ప్రజలు ‘ఛీ’ అనడంతో అడ్డదారుల్లో సర్క్యులేషన్ పెంచడానికి తంటాలు పడుతున్నారు’’ అని ట్వీట్ చేశారు.