భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: జగన్‌కు లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2020-04-25T20:52:12+05:30 IST

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్ధిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: జగన్‌కు లోకేష్ లేఖ

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్ధిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది తొలుత ఇసుక సమస్య కారణంగా భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా లాక్ డౌన్ వల్ల పూట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 


నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసిందన్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ వారిని మరింత దెబ్బతీసిందన్నారు. కార్మికులకు అందుబాటులో ఉన్న 1900కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. చంద్రన్న బీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.


Updated Date - 2020-04-25T20:52:12+05:30 IST