నానీ సంగతి తేలుస్తాం

ABN , First Publish Date - 2020-09-24T07:41:02+05:30 IST

మంత్రి కొడాలి నాని మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆచరణ, నిబద్ధత కలిగిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి గురించి తెలుసుకోకుండా వాగుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

నానీ సంగతి తేలుస్తాం

మంత్రి కొడాలిపై బీజేపీ నేతల ఫైర్‌ 

నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపు 


అమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మంత్రి కొడాలి నాని మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆచరణ, నిబద్ధత కలిగిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి గురించి తెలుసుకోకుండా వాగుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నాని సంగతి ప్రజాక్షేత్రంలో తేలుస్తామని హెచ్చరించారు. భార్యను సైతం క్విడ్‌ ప్రో కో కేసుల్లో ఇరికించిన వ్యక్తులకు మోదీ, యోగి పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదన్నారు.


బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, జాతీయ లేబర్‌ బోర్డు చైర్మన్‌ జేపీ వల్లూరి, లంకా దినకర్‌ తదితరులు మంత్రిపై ధ్వజమెత్తారు. నానిపై జగన్‌ చర్య తీసుకోకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో గురువారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. మంత్రిపై 24 గంటల్లోపే కేసు నమోదు చేయాలని విష్ణు డిమాండ్‌ చేశారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని ఎంపీ జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-09-24T07:41:02+05:30 IST