కట్టడం చేతగాక పేర్లు మార్పు

ABN , First Publish Date - 2020-12-10T08:15:06+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వంకి ప్రాజెక్టులు కట్టడం చేతగాక టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టుల పేర్లు మార్చి నాటకాలు ఆడుతోంది.

కట్టడం చేతగాక పేర్లు మార్పు

మేం వస్తే మళ్లీ పరిటాల పేరే: దేవినేని

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వంకి ప్రాజెక్టులు కట్టడం చేతగాక  టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టుల పేర్లు మార్చి నాటకాలు ఆడుతోంది. పనులు చేయడంలో లేని తెలివిని, వాటిని రద్దు చేసి కొత్తగా ఇవ్వడంలో మాత్రం చూపిస్తున్నారు. పేర్లు మార్చడం కోసమే ఈ ప్రయాస అన్నట్లు కనిపిస్తోంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.


‘‘అనంతపురం జిల్లాలో పేరూరు డ్యాంకు నీళ్ళు రావడం కోసం జీడిపల్లి-ఎగువ పెన్నార్‌ ప్రాజెక్టు కోసం పరిటాల రవీంద్ర ఎంతగానో పోరాడారు. చంద్రబాబు పాదయాత్రలో అక్కడే బస చేశారు. నాడు దానిని పరిశీలించి, సీఎం అయిన తర్వాత దానికి హంద్రీనీవా ద్వారా నీరు వచ్చే ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టుకు పరిటాల రవీంద్ర పేరు పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఆ పేరు మార్చి వైఎస్‌ పేరు పెట్టింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి మళ్ళీ పరిటాల రవీంద్ర పేరే పెడతాం’’ అని ఉమా ప్రకటించారు. 


Updated Date - 2020-12-10T08:15:06+05:30 IST