గుంటూరు జిల్లాను వెంటాడుతున్న నగ్న చిత్రాల వ్యవహారం

ABN , First Publish Date - 2020-07-15T23:19:37+05:30 IST

ఇంజనీరింగ్ విద్యార్థి నగ్న చిత్రాలు ఘటన మరవకు ముందే మరో ఘటన జరిగింది. మార్ఫింగ్ పోటోలతో అమ్మాయిలకు నగ్న చిత్రాలు పంపుతున్న

గుంటూరు జిల్లాను వెంటాడుతున్న నగ్న చిత్రాల వ్యవహారం

గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థి నగ్న చిత్రాల ఘటన మరవకు ముందే మరో ఘటన జరిగింది. మార్ఫింగ్ ఫొటోలతో అమ్మాయిలకు నగ్న చిత్రాలు పంపుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్న కామరాజుగడ్డ రఘుబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి అమ్మాయిల ఫొటోలను రఘుబాబు మార్ఫింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే 10 మంది యువతులను మార్ఫింగ్ ఫొటోలతో నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ సిమ్‌కార్జులు, ఫేక్ అకౌంట్‌లతో రఘుబాబు నగ్న చిత్రాలు పంపేవాడు. అయితే ఓ యువతి  ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు రఘుబాబును అరెస్ట్ చేశారు. రఘుబాబుది నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామం. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో యానిమేషన్, మల్టీమీడియా కోర్సులను నేర్చుకున్నాడు. ఈ విషయమై స్పందించిన జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆన్‌లైన్ వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే సైబర్ మిత్రకు ఫోన్ చేయాలని తెలిపారు.


ఇటీవల జిల్లాలో నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసిన నిందితులను పోలీసలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్ధినిని బ్లాక్‌మెయిల్ చేసిన వరుణ్, కౌశిక్‌లు అరెస్టైన నేపథ్యంలోనే మరికొన్ని దురాగతాలు వెలుగులోకొచ్చాయి. బాధితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిన నగ్నంగా చిత్రీకరించి బెదిరించడం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మణికంఠ, ధనుంజయరెడ్డి, తులసి కృష్ణ, భాస్కర్, కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఫోక్సో చట్టం సహా వివిద సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. ఇద్దరిపై రౌడీషీట్ కూడా తెరిచినట్లు సమాచారం.

Updated Date - 2020-07-15T23:19:37+05:30 IST