నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి పెరిగిన వరద

ABN , First Publish Date - 2020-09-14T15:03:50+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి పెరిగిన వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు నాలుగు క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 99,776 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 99,776 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.... ప్రస్తుత నీటి నిల్వ 310.8498 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-09-14T15:03:50+05:30 IST