-
-
Home » Andhra Pradesh » nadendla manohar pawan kalyan janasena
-
వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2020-03-13T23:13:52+05:30 IST
రాష్ట్రంలో పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని

రాజమండ్రి: రాష్ట్రంలో పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని, సీఎం 90శాతం సీట్లు సాధించాలని చెప్పడం వల్లే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నది- మన నుడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. నదుల పరిరక్షణ, తెలుగు భాషకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.