విలువైన భూములను అమ్మేస్తున్నారు: నాదెండ్ల

ABN , First Publish Date - 2020-05-19T00:45:46+05:30 IST

కరోనా ప్రభావం ఉండగానే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ దుష్ప్రభావం ఇప్పటికీ ప్రజలను

విలువైన భూములను అమ్మేస్తున్నారు: నాదెండ్ల

విశాఖపట్నం: కరోనా ప్రభావం ఉండగానే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ దుష్ప్రభావం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉందన్నారు. స్టైరిన్ ప్రభావం 3 కిలోమీటర్ల వరకూ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పరిధిని 600 మీటర్లకే కుదించిందని విమర్శించారు. ఈ అంశంపై నాయకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఉన్న ఆస్తులను వేలం వేసి అమ్మేస్తోందని విమర్శించారు. విశాఖపట్నంలో సైతం విలువైన భూములను అమ్మకానికి పెట్టేసిందన్నారు. దీనిపై ఇప్పటికే జనసేన నేతలు నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మాటలు చెప్పకుండా చేతలతో సమస్యలు పరిస్కరించాలని సూచించారు.

Updated Date - 2020-05-19T00:45:46+05:30 IST