ప్రకృతిని పరిరక్షించేందుకు పాటుపడాలి

ABN , First Publish Date - 2020-10-24T09:06:57+05:30 IST

ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరు పాటుపడాలని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న

ప్రకృతిని పరిరక్షించేందుకు పాటుపడాలి

చిన జీయర్‌ స్వామి

విజయవాడ(వన్‌టౌన్‌), అక్టోబరు 23 : ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరు పాటుపడాలని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా ఏడోరోజు శుక్రవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను చిన జీయర్‌ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ. సురేష్‌ బాబు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


చిన జీయర్‌ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వాక్సిన్‌ పరీక్షలు సఫలం కావాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.   స్వామిజీ వెంట మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు దంపతులు తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-10-24T09:06:57+05:30 IST