ముస్లింలకు ఇది కరెక్ట్‌కాదు!

ABN , First Publish Date - 2020-04-12T08:09:16+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో ముస్లింలు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి...

ముస్లింలకు ఇది కరెక్ట్‌కాదు!

  • ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వ్యాప్తి 
  • చేస్తున్నట్టు వీడియోల్లో చూశా: నారాయణస్వామి
  •   

తిరుపతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో ముస్లింలు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ‘‘ఐసోలేషన్‌కు తీసుకెళ్లిన ముస్లింలు వైద్యులకు సహకరించడంలేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు సహకరించాలి’’ అని సూచించారు. అదే సమయంలో ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వ్యాప్తి చేసినట్టు అనిపిస్తోందని, దీనికి సంబంధించి కూడా వీడియోలు వచ్చాయని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఎవరైనా వైద్యులకు సహకరించాల్సిందేనన్నారు. ఈ మేరకు శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు క్యారెక్టర్‌ లేదని విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2020-04-12T08:09:16+05:30 IST