-
-
Home » Andhra Pradesh » Muslim minorities protest
-
గుంటూరు జిల్లా: ముస్లిం మైనారిటీల ఆందోళన
ABN , First Publish Date - 2020-12-06T16:26:59+05:30 IST
ఓ స్దలం విషయంలో రెండు సామాజిక వర్గాల మద్య వివాదం నెలకొంది.

గుంటూరు జిల్లా: నరసరావుపేట మండలం, జొన్నలగడ్డలో ఓ స్దలం విషయంలో రెండు సామాజిక వర్గాల మద్య వివాదం నెలకొంది. దీంతో ముస్లిం మైనారిటీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ స్థలంలో మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ స్థలం తమదని మరో సామాజిక వర్గం అంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదు నిర్మాణంకి గతంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి భూమిపూజ చేశారు. అది ప్రభుత్వ స్థలం అని తహాశీల్దార్ కూడా ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు.