ముంబయి క్వారంటైన్‌ నుంచి భీమవరం యువకుడి పరారీ

ABN , First Publish Date - 2020-03-21T09:42:51+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ యువకుడు (22) ముంబయిలోని క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకొని వచ్చాడు. దుబాయ్‌ నుంచి ముంబయికి చేరుకున్న అతణ్ని అక్కడి

ముంబయి క్వారంటైన్‌ నుంచి భీమవరం యువకుడి పరారీ

  • ఎల్‌బీనగర్‌లో బస్పు ఎక్కుతుండగా.. అడ్డుకొని దించేసిన ప్రయాణికులు
  • గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు


హైదరాబాద్‌/మన్సూరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ యువకుడు (22) ముంబయిలోని క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకొని వచ్చాడు. దుబాయ్‌ నుంచి ముంబయికి చేరుకున్న అతణ్ని అక్కడి అధికారులు క్వారంటైన్‌కు తరలించి చేతిపై ముద్ర వేశారు. అయితే అతడు అక్కడి నుంచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎల్‌బీనగర్‌లో భీమవరం వెళ్లే ప్రైవేటు బస్సులో ఎక్కాడు. అతని చేతికి ఉన్న కరోనా క్వారంటైన్‌ ముద్ర చూసిన ఇతర ప్రయాణికులు.. బస్సు నుంచి దింపేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఎల్‌బీనగర్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరంగాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, యువకు ముంబయి క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకొని వచ్చినట్లు భావిస్తున్నారు. తనతోపాటు మరో ముగ్గురు కూడా దుబాయ్‌ నుంచి వచ్చినట్లు, వారు నిజామాబాద్‌కు వెళ్లినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని చింతల్‌కుంట మల్లికార్జుననగర్‌ నార్త్‌ కాలనీకి ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అతణ్ని గాంధీ ఆస్పత్రి ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. హయత్‌నగర్‌ సర్కిల్‌లో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరిని గాంధీకి తరలించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-03-21T09:42:51+05:30 IST