మోసం చేసి పోటీకి దూరంచేశారు!

ABN , First Publish Date - 2020-03-16T09:40:25+05:30 IST

ఎన్నికల అధికారులు సైతం అధికార పార్టీతో కుమ్మకై నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా కుట్ర పన్ని తనను పోటీ నుంచి దూరం చేశారని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట సెగ్మంట్‌-3 ఎంపీటీసీ

మోసం చేసి పోటీకి దూరంచేశారు!

  • కలెక్టర్‌కు ఎంపీటీసీ అభ్యర్థి ఫిర్యాదు

విజయనగరం, మార్చి15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల అధికారులు సైతం అధికార పార్టీతో కుమ్మకై నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా కుట్ర పన్ని తనను పోటీ నుంచి దూరం చేశారని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట సెగ్మంట్‌-3 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి బెవర రామకృష్ట ఆవేదన వ్యక్తంచేశాడు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హరిజవహర్‌లాల్‌కు ఈ మేరకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. రామకృష్ట ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. 14వ తేదీ సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా కొంతమంది వచ్చి నామినేషన్‌ పత్రాల్లో కొన్ని సంతకాలు లేవని, ఆర్‌వో రమ్మంటున్నారంటూ పిలిచారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సాయంత్రం 5.30 గంటలకు సంతకం తీసుకున్నాక రాత్రి 8 గంటలకు ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న వారి జాబితాలో తన పేరును చేర్చారని రామకృష్ణ తెలిపాడు. మోసపోయానని గుర్తించి టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌కు జరిగిన విషయాన్ని తెలిపి, ఆదివారం కలెక్టర్‌ను కలసి ఫిర్యాదుచేశాడు.

Updated Date - 2020-03-16T09:40:25+05:30 IST