కరోనా కట్టడికి ఎంపీలకు ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2020-03-25T09:17:55+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేకంగా ఒకే దఫాలో నిధులు...

కరోనా కట్టడికి ఎంపీలకు ప్రత్యేక నిధులు

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేకంగా ఒకే దఫాలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను ఒకేదఫాలో ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా ఖర్చుచేయాల్సిందేనని ఎంపీల్యాడ్స్‌ విభాగం కార్యదర్శి తన్వీర్‌ ఖమర్‌ మహమ్మద్‌ ఎంపీలకు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినియోగించేందుకు అనుమతించబోమన్నారు. ఈ నిధులను తక్షణమే వ్యయం చేయాలని జిల్లాల యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. 

Read more