విశాఖ: ఆర్కేబీచ్రోడ్లో వైఎస్‌కు ఎంపీ విజయసాయి నివాళి
ABN , First Publish Date - 2020-07-08T15:10:34+05:30 IST
విశాఖ: ఆర్కేబీచ్రోడ్లో వైఎస్‌కు ఎంపీ విజయసాయి నివాళి

విశాఖపట్నం: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో వైయస్సార్ విగ్రహానికి ఎంపీ విజయసాయిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పాలన స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా 108, 104 సేవలు అందుబాటులో ఉంచారని తెలిపారు. వైయస్సార్ జయంతి వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.