డాక్టర్ సుధాకర్ ఘటనపై విజయసాయి రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2020-05-17T20:47:26+05:30 IST

రోనాకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు

డాక్టర్ సుధాకర్ ఘటనపై విజయసాయి రియాక్షన్ ఇదీ..

అమరావతి : కరోనాకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ పట్ల విశాఖపట్నం పోలీసులు శనివారం దారుణంగా వ్యవహరించిన విషయం విదితమే. నిన్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయ్యో అంత అన్యాయం జరిగిందా..?

ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లో వైరస్ ప్రభావంతో వైజాగ్‌లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని!. అయ్యో అంత అన్యాయం జరిగిందా..? అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుందిఅని విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎంపీ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2020-05-17T20:47:26+05:30 IST