‘వైసీపీలోకి రావాలంటే ముందు ఆ పని చేయాలి’

ABN , First Publish Date - 2020-10-03T11:24:31+05:30 IST

వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా ఎమ్మెల్యే తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గాంధీ జయంతిని

‘వైసీపీలోకి రావాలంటే ముందు ఆ పని చేయాలి’

విశాఖపట్నం: వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా ఎమ్మెల్యే తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారమిక్కడ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారన్నారన్నారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాలను పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Updated Date - 2020-10-03T11:24:31+05:30 IST