బందరు రోడ్డులో అంబేద్కర్ విగ్రహం: ఎంపీ

ABN , First Publish Date - 2020-07-09T00:51:13+05:30 IST

నగరంలోని బందరు రోడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. గత ప్రభుత్వం మారుమూల ప్రాంతంలో, దిక్కూ మొక్కూ

బందరు రోడ్డులో అంబేద్కర్ విగ్రహం: ఎంపీ

విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. గత ప్రభుత్వం మారుమూల ప్రాంతంలో, దిక్కూ మొక్కూ లేనిచోట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనుకుందని ఆయన విమర్శించారు. ఇదే అంశమై బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అంబేద్కర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా తక్కువేనని అన్నారు. ఆయన విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని శ్రీకారం చుట్టామని ఎంపీ చెప్పుకొచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌లో ఆన్‌లైన్ ద్వారా బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Updated Date - 2020-07-09T00:51:13+05:30 IST