సరైన సమయంలో కేంద్రం జోక్యం: సుజనా

ABN , First Publish Date - 2020-07-05T09:05:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంకుశ పోకడలతో వెళ్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. రాజధానిగా అమరావతికి ఉన్న అనుకూలతలు మరే

సరైన సమయంలో కేంద్రం జోక్యం: సుజనా

అమరావతి, గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంకుశ పోకడలతో వెళ్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. రాజధానిగా అమరావతికి ఉన్న అనుకూలతలు మరే  ప్రాంతానికీ లేవన్నారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెంది ఆర్థిక రాజధానిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి నిధులిచ్చిందని, రైతులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిందని, రాజధాని కాబట్టే కేంద్రం సాయం చేసిందని చెప్పారు. అమరావతి విషయంలో సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పేర్కొన్నారు. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం ఫలిస్తుందన్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్‌ ఆన్‌లైన్‌ సదస్సులో సుజనా చౌదరి పాల్గొని ప్రసంగించారు.

Updated Date - 2020-07-05T09:05:27+05:30 IST