యువతకు ప్రాధాన్యం ఇవ్వండి: రామ్మోహన్‌

ABN , First Publish Date - 2020-05-29T08:49:41+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనే శక్తి యువతకే ఉందని, వారికి పార్టీలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

యువతకు ప్రాధాన్యం ఇవ్వండి: రామ్మోహన్‌

రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనే శక్తి యువతకే ఉందని, వారికి పార్టీలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. ‘పాలకులు ఎంత నియంతలైనా.. అహంకారులనైనా వారిని యువత ఢీకొట్టగలుగుతారు. పార్టీకి ఉత్తేజాన్ని కల్పించి పునరుజ్జీవం తెస్తారు. వారి ప్రాధాన్యాన్ని గుర్తించాలి’ అని చంద్రబాబును కోరారు. ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి ఒక చాన్సు ఇస్తే ఆయన తనకు లభించిన అధికారాన్ని కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని, తప్పులు ఎత్తిచూపినవారిపై దండెత్తడానికే ఆయన సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతో మంది మూర్ఖులు టీడీపీని లేకుండా చేద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

Updated Date - 2020-05-29T08:49:41+05:30 IST