మతంపై దాడిలా అంతర్వేది ఘటన.. సీఎం స్పందించాలి: ఎంపీ రఘురామరాజు

ABN , First Publish Date - 2020-09-06T18:48:07+05:30 IST

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.

మతంపై దాడిలా అంతర్వేది ఘటన.. సీఎం స్పందించాలి: ఎంపీ రఘురామరాజు

న్యూఢిల్లీ: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక మతంపై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని ఎంపీ అన్నారు. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినా పిచ్చోడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారని విమర్శించారు. అలా కాకుండా విచారణ జరిపి బాధ్యులెవరైనా, ఏ మతస్థులైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-09-06T18:48:07+05:30 IST