సీఎం జగన్‌కు ఎంపీ రఘురాజు మరో లేఖ.. ఈసారి..

ABN , First Publish Date - 2020-07-19T15:07:20+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు.

సీఎం జగన్‌కు ఎంపీ రఘురాజు మరో లేఖ.. ఈసారి..

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే పలు విషయాలపై జగన్‌కు లేఖలు రాసిన ఆయన తాజాగా.. రాష్ట్రంలోని గోశాల గురించి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ సీఎంగా ఉన్న 2005లో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమీటీలు వేయలేదు. ఆర్ధిక ఇబ్బందులు వలనే గత ఏడాది సింహాచలం పుణ్యక్షేత్రంలో మూడు ఆవులు చనిపోయాయి. విజయవాడ సమీపంలోని తాడేపల్లి-కొత్తూరు గోశాలలో వంద ఆవులు విషప్రయోగం వలన చనిపోయాయి. ఆవులు, దూడలు సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. అన్నివర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలిఅని లేఖలో రఘురాజు నిశితంగా వివరించారు. అయితే ఇదివరకు ఎంపీ రాసిన లేఖలకు జగన్ నుంచి కానీ పార్టీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మరి దీనిపై అయినా స్పందన వస్తుందో లేదో వేచి చూడాలి.

Updated Date - 2020-07-19T15:07:20+05:30 IST