సీఎం జగన్‌కు రఘురామరాజు కీలక సూచన

ABN , First Publish Date - 2020-12-07T18:02:17+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. ఏలూరు ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని లేఖలో పేర్కొన్నారు.

సీఎం జగన్‌కు రఘురామరాజు కీలక సూచన

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. ఏలూరు ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని లేఖలో పేర్కొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, పరిసర ప్రాంతాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. నిపుణులైన వైద్యులను, అవసరమైన మందులను ఏలూరుకు త్వరితగతిన పంపాలని విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌తో పాటు ఇతర ప్రముఖ వైద్యులను సంప్రదించి పరిష్కార మార్గం కనుగొనాలన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత పరిశోధన సదుపాయాలు ఉన్న ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డితో మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత శ్రద్ద తీసుకుని సమస్య మూలాలను తెలుసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. Updated Date - 2020-12-07T18:02:17+05:30 IST