ఎన్డీయేలోకి వైసీపీ.. అవన్నీ అబద్ధాలే: ఎంపీ రఘురామ రాజు

ABN , First Publish Date - 2020-10-07T20:01:04+05:30 IST

బీజేపీలో తన చేరికపై కొందరు పేలుతున్నారని ... ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయేలోకి వైసీపీ..  అవన్నీ అబద్ధాలే: ఎంపీ రఘురామ రాజు

న్యూఢిల్లీ: బీజేపీలో తన చేరికపై కొందరు పేలుతున్నారని ... ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము మంత్రులం అయిపోయామని... వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెబుతున్నారన్నారు. బుధవారమిక్కడ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నవంబర్‌లో జరిగే కేంద్రమంత్రివర్గ విస్తరణ వరకు ఇలాగే ప్రచారం చేసుకుంటారు. అన్నీ అబద్ధాలే అని నవంబర్‌లో తేలుతుంది. ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పింది. కానీ వైసీపీ సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్‌లోకి రావాలని బతిమాలుతున్నట్టు... ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు అంత ప్రేమ ఉందా? ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్‌ నుంచి బయటకు రావాలని... అప్పట్లో టీడీపీని డిమాండ్‌ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. జగన్‌ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే... నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అన్నారు. 


దేవాలయాలు నిర్మించే బీజేపీ... ఆలయాలు కూలగొట్టే వైసీపీతో కలుస్తుందా అని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు ప్రశ్నించారు. దేవాలయాలు నిర్మించే పార్టీ బీజీపీ.. దేవాలయాలు నిర్మూలించాలనుకునే పార్టీ వైసీపీ అన్నారు. ఆలయాలను నిర్మూలించే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్‌... బీజేపీతో కలవాలనుకుంటున్నారా? జగన్‌ చెబుతున్నట్టు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే... నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. 


Updated Date - 2020-10-07T20:01:04+05:30 IST