అమరావతి భూములపై సీబీఐని వేయండి

ABN , First Publish Date - 2020-09-17T09:15:20+05:30 IST

రాజధాని ప్రాంతంలో భూముల కోనుగోళ్ల ఆరోపణలు, ఏసీబీ కేసును వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ ...

అమరావతి భూములపై సీబీఐని వేయండి

లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి

ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో భూముల కోనుగోళ్ల ఆరోపణలు, ఏసీబీ కేసును వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధాని భూముల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని మిథున్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి ఏకపక్షంగా దర్యాప్తు జరుగుతుందని భావన ఉంటుందని, కాబట్టి దీనిని సీబీఐతో దర్యాప్తు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. అదేవిధంగా, ఫైబర్‌గ్రిడ్‌ నిధుల అవకతవకలు, అంతర్వేది రథం ఘటనపైనా సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు.

Updated Date - 2020-09-17T09:15:20+05:30 IST