రాజధాని గ్రామాల్లో ఎంపీ గల్లా జయదేవ్ పర్యటన
ABN , First Publish Date - 2020-06-18T18:38:16+05:30 IST
రాజధాని గ్రామాల్లో ఎంపీ గల్లా జయదేవ్ పర్యటన

అమరావతి: రాజధాని గ్రామాల్లో పర్యటన నిమిత్తం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అమరావతికి చేరుకున్నారు. తుళ్ళురు, వెలగపూడి, మందడంలో పర్యటించిన ఎంపీ...ఇళ్ళ వద్ద దీక్షలు చేస్తున్న రైతులను కలసి సంఘీభావం తెలిపారు. ఉభయ సభలలో సీఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పెట్టడంపై రైతులు మండిపడ్డారు. ఉద్యమం చేస్తున్న రైతులకు, రైతు కూలీలకు ఎంపీ సంఘీభావం తెలియజేశారు. శాసనమండలిలో, శాసనసభలో జరిగిన పరిణామాల పట్ల ఆందోళన చెంది గుండె ఆగి చనిపోయిన అంనంతారం రైతు చింకా సాంబయ్య మృతి పట్ల ఎంపి గల్లా జయదేవ్ మౌనం పాటించారు.